ఒకానొక ‘‘లవ్ స్టోరీ’’ ఆఫ్ సారంగధరియా
జానపదుల లోతుల్ని అంతసులభంగా అంచనా
వేయలనుకోవడం సరికాదేమో
శేఖర్ కమ్ముల చేతిలో రూపుదిద్దుకుంటున్న లవ్ స్టోరీ చిత్రం కోసం సాయిపల్లవి పై చిత్రీకరించిన సారంగధరియా పాటపై పెద్ద దుమారమే నడిచింది.
కనీస
వంద ఏళ్ళనుంచి వాడుకలో వున్న ఒక పాటని కోమలి అనే అమ్మాయి వాళ్ల అమ్మమ్మ గారి దగ్గర
నేర్చుకుని అప్పుడెప్పుడో టివీ కార్యక్రమంలో పాడింది. దానిని ఆధారంగా చేసుకుని
సుద్దాల అశోక్ తేజ గారు రాసిన పాటకు మంగ్లీ గొంతుతో తెరకెక్కింది. సారంగ ధరియా
పాటకు తేజ గారు సారంగి అనే వాయిద్యాన్ని ధరించినది ఆమెను సారంగధరియా అని
సంభోందించారు అని చెప్పారు అదే అర్ధాన్ని తను స్వీకరిస్తూ తను రాసిన ఒక చరణంలో
ఆమెను తీగలు లేని సారంగిగా పేర్కొంటూ మర్లపడితే సివంగి అన్నారు. అయితే
సారంగధరియాకు ఆ అర్ధం పొసుగుతుందా మరి?
దానికొసం ముందుగా ఒరిజినల్ పాటలోని అర్ధాన్న స్థూలంగా చూద్దాం.
తన
భార్య అందానికి మురిసి పోతూనే ఆమె గొప్పతనాన్ని కూడా పొగుడుతూ చెప్తున్నాడు
భర్త. ఎవరో జంగమయ్యమాదిరి మారువేషంలో
వచ్చాడేమో. ఆ యవ్వనవతి అయిన పేద తల్లి బిడ్డను వేప చెట్టుకొమ్మలకు కట్టిన ఉయ్యాలలో
వేసి కడవతో నీళ్ళు అటూ ఇటూ మోస్తూ ఇంటిపనులు చేస్తున్న సంగతిని గమనిస్తూ ఉన్నాడు ఆ
సందర్భంలో బహశా మిత్రులతోనూ ఆ పాట శ్రోతలతోనూ ముచ్చటగా మురిసి పోతూ ఆమెను
వర్ణిస్తున్నాడు. ఆలా వర్ణిస్తూనే అంత మాత్రాన కన్నుబడిన వారు పిలిస్తే వచ్చేంత
అల్పురాలు కాదని కూడా మెచ్చుకుంటుంటాడు. ఆ క్రమంలోనే మిగిలిన క్లూలను కూడా ఇస్తాడు
తను. నిజానికి ఒరిజినల్ జానపద గీతంలోని ఈ ముగింపే పాటకు మరింత అందాన్ని ఇస్తుంది.
ఆ వేపకు వుందో పాప అది తన పాపే అనడంతో ఆ పాపకు తండ్రిని అని మొదటి క్లూని, ఆ
తర్వాత ఆమె వైపు చూస్తే ఆమె మొగుడు
ఒప్పుకోడు అని చెప్పి ఆ వెంటనే ఆ మొగుడు తనే అనే సందడి ముక్తాయింపు నిస్తాడు ఆ
పాటగాడు. కాలక్రమంలో ఎన్ని మార్పులకు చేర్పులకు లోనయ్యాయో కానీ అందుబాటులో వున్నంత
వరకూ ఆ చరణాలు ఇలా వుంటాయి.
దాని కుడీ భుజం మీద కడువా… దాని గుత్తెపు
రైకలు మెరియా
అది రమ్మంటె రాదు సెలియా… దాని పేరే సారంగ
దరియా
దాని కుడీ భుజం మీద కడువా… దాని గుత్తెపు
రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర సెలియా… దాని పేరే సారంగ
దరియా
దాని శిఖన ఉన్నదొక పువ్వు… దాని పువ్వుల
నాదొక్క నవ్వు
అది రమ్మంటె రాదుర సెలియా… దాని పేరే సారంగ
దరియా ||2||
దాని మెడకు ఉన్నది ఒక గొలుసు… దాని గొలుసుల
నాదొక మనసు
అది రమ్మంటె రాదుర సెలియా.. .దాని పేరే సారంగ దరియా ||2||
దాని ఇంటి ముందట ఒక బురదా… దాని బురదల
నాదొక్క నిడదా
అది రమ్మంటె రాదుర సెలియా… దాని పేరే సారంగ
దరియా ||2||
దాని ఎడమ భుజం మీద కడువా… దాని ఎజెంటు
రైకలు మెరియా
అది రమ్మంటె రాదుర సెలియా… దాని పేరే సారంగ
దరియా ||2||
దాని ఇంటిముందరొక యాప… దాని యాపల
నాదొక్క పాప
అది రమ్మంటె రాదుర సెలియా… దాని పేరే సారంగ
దరియా ||2||
దాని మూలకున్నదొక తుంటా… దాని మొగుడొస్తే
నాకు తంటా
దాని మొగుడొస్తే నాకు తంటా… దాని మొగణ్ణి
నేనేనంటా||2||
దాని కుడీ భుజం మీద కడువా… దాని గుత్తెపు
రైకలు మెరియా
అది రమ్మంటె రాదు సెలియా… దాని పేరే సారంగ
దరియా
దాని పేరే సారంగ దరియా
రమ్మంటే రాని చెలియ ‘‘సారంగధరియా’’ ఎలా అయ్యింది మరి
·
కుంభకోణంలోని సారంగధర ఆలయం విష్ణువుది కానీ సారంగధరుడు
అనే మాట శివుడి(a particular aspect of Siva)కి కూడా ఒప్పుతుంది ఎలాగంటే సారంగమంటే జింక అనే అర్ధం వుంది అటువంటి జింకను హస్తం నందు ధరించిన వాడు కాబట్టి శివుడు కూడా సారంగ ధరుడు అయ్యాడు. సారంగికుడు అంటే మృగములను చంపువాడు. వేటగాడు అనే (సారంగాన్ మృగాన్ హంతి). ఆది బిక్షువు అడవి వేటగాడి చేతిలో ఇలా వేట ఫలంగా జింక వుండటం చిత్రమైన సంగతేమీ కాదు. గుడిమల్లంలోని శివుడి విగ్రహంలోనే కాదు శివుడి ఐకనోగ్రఫీలో ఇది ప్రముఖంగా కనిపిస్తుంది. గధను ధరించిన వాడు గధాధరుడు, చక్రన్ని ధరించిన వాడు చక్రధారి అయినట్లుగానే సారంగధరుడు ఈయన. ఆయన సగభాగం అయిన పార్వతీదేవికి ఈ సారంగధరియా నప్పుతుంది. దరియా అనేది హిందీలో నది అనే పేరువున్నప్పటికీ ఇక్కడ ఆ పదాన్ని విడిగా తీసుకోవడం కుదరదు. దరియా మహతీవాచక సూచకమే అనడం నప్పుతుంది.
మరి రమ్మంటే రాని చెలియ సారంగధరియ ఎలా అవుతుంది
జలంధరుడితో
సహా అనేకమంది రాక్షసులు బోళాశంకరుడిని వరంకోరుకునే నేపద్యంలో పొరలు కమ్మిన కళ్ళకు
అమ్మఅనేసంగతి మరచిపోయి ఆమెనే కోరాలనుకుంటారు. రమ్మన్న మాత్రాన వస్తుందా ఆదిశక్తి
స్వరూపిని వాడి వచ్చినా వాడి మృత్యువు రూపంలోనే వచ్చింది. కొంచెం ఓపిగ్గా
వెతుక్కుంటే ఆ కథలను చదువుకోవచ్చు. అదే పద్దతిలో జంగమదేవరలాగానే మారువేషంలో వచ్చిన
ఈ చిలిపి శివుడు కూడా తన నెచ్చెలిని పార్వతితో పోలుస్తూ రమ్మంటే రాదురా అంటున్నాడు
అనుకోవడం బాగా ఒప్పుతోంది. పైగా జానపదులకు పటంకథలనుంచి బాగా ఇష్టమైన జంట
శివపార్వతులే. సారంగుడు అంటే మన్మధుడు అనే అర్ధం వున్నప్పటికీ మన్మధతాపం
కలిగించేది ఈ సారంగధరియా అనుకోవడం కన్నా ఇది దగ్గరగా వుంది అనిపించింది.
సారంగి అనేది చీర కాదా?
మన
గ్రామీణ ప్రాంతాలలో పెద్దగడిలో చిన్నగడివచ్చే చీరలను సారంగీలనడం కద్దు. ఈ సంగతి
రవ్వా శ్రీహరి నిఘంటువులోనూ ప్రస్తావించారు. పైన చెప్పుకున్నట్లే రమ్మంటే రాని
తనానికి ఈ చీర కట్టుకోవడం కారణం అని చెప్పివుంటారనుకోను. రమ్మంటే వచ్చేవారేదో
చుక్కల చీర కడతారని, అలా కానివారు గళ్ళచీర కడతారనే ఆనవాయితీలేవో వున్నాయని కాదు
కదా.
పెద్ద సారు చెప్పినట్లు సారంగిని ధరించినది ఎందుకు కాదు.
ఎందుకు
కాదంటే సారంగి అనే వాయద్యం వున్న మాట నిజమే అటువంటి సారంగిని ధరించిన వారు అనాలంటీ
సారంగ ధరియా కాదు సారంగీధరుడు సారంగీధరియా అనాలి కదా. సారంగీ వాయిద్య విశేషాన్ని
సారంగ వాయిద్యంగా పేర్కొన్నట్లు ఎక్కడా లేదు. అసలీ మానవుడి గొంతుకు దగ్గరగా వుండేంత గొప్ప సంగీతం
వినిపించగలదన్న ఈ వాయిద్య విశేషానికి ఈ పేరు రావడానికి కారణం సౌ + రంగీ వంద రంగులు లేదా వంద గొంతులు పలక గలది అనే అర్దం లోనే కాబట్టి సారంగధరియా
అనేది వాయిద్య విశేషాన్ని ధరించడం వల్ల ఏర్పడిన పేరు కానే కాదని మనకు సులభంగానే
అర్ధం అవుతోంది ఇక సందర్భాన్ని పట్టిచూసినా ఆమె కడవలను అప్పటికే మోస్తూ
తిరుగుతోంది. పాటగాడైన ఆమె భర్త కూడా ఆమెను ఆ పనుల్లో చూస్తూనే మురుస్తున్నాడు.
సారంగి ని వాయించే ఆవిడ కాబట్టి రాట్లేదు అనే అర్దం అస్సలు రాబట్టే అవకాశం
కనిపించడం లేదు. పేరు ఏదన్న పెట్టుకోవాలనుకుంటే అమ్మదేవత పేరును పెట్టుకునే అవకాశం
మెండు మగవాల్లలో సారంగపాణి, సారంగధర అని పెట్టుకున్నట్లే.
రాజరాజ నరేంద్రుడి కోడలి ముచ్చట కావచ్చా?
రాజు లేనప్పుడూ సారంగో నువ్వు రారాద పోరాదా సారంగా
అనే
మరొక జానపద గీతం నేపద్యంలో ఈ సారంగధరియాకు మరో అర్ధాన్ని కూడా లాగారెవరో పేరు
గుర్తులేదు కానీ యూట్యూబ్ లో మొన్న కనిపించింది. రాజమహేంద్రపురి నేలిన
రాజరాజనరేంద్రుని కొడుకు పేరు సారంగధరుడు అతనికి పెళ్లీడు రాగానే అందగత్తె అయిన ఒక
అమ్మాయిని అతడికి ఇవ్వలని వెతికి చూసి ఆమె అందానికి మోహితుడై కొడుకుకి కాకుండా తన
కోసమే ఆమెను అట్టే పెట్టుకుంటాడట. అయినా సరే ఈ ముసలి రాజుకన్నా ఆతని కుమారుడు
సారంగధరుడిని ఇష్టపడిన ఆమె రాజుగారికి తెలియకుండా సారంగధరుడిని కలిసేదట. ఆ
సందర్భంగా అనే అర్దంలోనే ఈ రాజులేనప్పుడు సారంగో అనే పాటను పేర్కొంటారు.
రాజమండ్రిలోని సారంగధర మెట్ట మీది ఆలయంలోని
శివుడిని సారంగధరేశ్వడిగానే కొలుస్తారు. కానీ ఆ సారంగధరుని భార్యని ఇలా
సారంగధరియా అని ఉదహరించారా అని చూస్తే నిజానికి అటువంటి పోలిక ఆ పాటలోని నాయిక
వ్యక్తిత్వాన్ని చిన్న బుచ్చడం లాంటిదే. కట్టడికి విరుద్దంగా ప్రవర్తించిన
పారంగధరితో నిప్పులాంటిది నా బార్య అని చెపుతున్న వ్యక్తి పోలిక తెస్తాడని
తెచ్చాడని భావించలేము. కాబట్టి సులభంగానే ఈ పోలికను పరిశీలనలోంచి పక్కతు
తీసేయవచ్చనుకుంటాను.
పాత సినిమాల్లోని సారంగధర కి ఈ దరియా ఏమన్నా చుట్టమా?
అబ్బే బొత్తిగా కాదండీ. గురజాడ అప్పారావు గారు ఆంగ్లంలో పద్య కావ్యంగా ఒక చరిత్రాత్మక కథ ఆ తర్వాత 1930 లో వైవి రావు దర్శకత్వంలో మూకీ సినిమాగా, 1937 లో పి పుల్లయ్య దర్శకత్వంలో బందా కనకలింగేశ్వరరావు సారంగధరుడిగానూ ఇక ఎన్టీవోడు వీరోగా భానుమతి నటించిన సారంగధర స్వాతంత్రం వచ్చాక 1957లో విడుదలైంది. వీటిల్లోని కథాంశం. రాజరాజనరేంద్రుడినికి సారంగధరుడు అనే కుమారుడు, చిత్రాంగి అనే రెండవ భార్య ఉండేది. రాజరాజ నరేంద్రుడి సవతి తల్లి కుమారుడు విజయాదిత్యుడు రాజ రాజ నరేంద్రుడికి పక్కలో బల్లం వలే ఉండేవాడు.
ఒకరోజు చిత్రాంగి
సారంగధారుడిని విందుకు ఆహ్వానించింది, వేట పై ఆసక్తి ఉన్న సారంగధారుడు విందుకు రాకుండా
వేటకు వెళ్తాడు. ఆ విషయాన్ని చారుల ద్వారా తెలుసుకొన్న విజయాదిత్యుడు చిత్రాంగి -
సారంగధారుడికి అక్రమ సంభంధం ఉన్నదని రాజారాజ నరేంద్రుడి చెబుతాడు. విషయా విషయాలు
పరిశీలించకుండా రాజరాజ నరేంద్రుడు సారంగధారుడి రెండు చేతులు, రెండు కాళ్ళు ఖండించాలని శిక్ష వేస్తాడు. సేవకులు రాజాజ్ఞ పరిపాలించి
సారంగధారుడిని నగరానికి ఉత్తర దిశలో అడవులతో నిండిన ఒక ఎత్తైన పర్వతం మీద రెండు
చేతులు రెండు కాళ్ళు ఖండించి పాడవేస్తారు. సారంగధారుడు రెండు చేతులు కాళ్ళ నుండి
నెత్తురు పారుతూ ఉండగా సారంగధారుడూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు సారంగ ధారుడికి ఆకాశవాణి
ద్వారా పూర్వ జన్మలో చేసిన పాపం వల్ల ఈ శిక్షని అనుభవించవలసి వచ్చిందని, ఈ జన్మలో పాపం ఏమి చెయ్యలేదని చెబుతుంది. ఆ ఆర్త నాధం విన్న మేఘనాధ అనే
శివ భక్తుడు అక్కడకు వచ్చి సారంగధారుడికి సపర్యలు చేసి, శివుడిని ప్రార్థించమని సలహా చెబుతాడు. సారంగధారుడు మేఘనాధుడి సూచన ప్రకారం
శివుడి ఆరాధిస్తే శివుడు ఆ ప్రార్థనతో సంతృప్తి చెంది సారంగధారుడికి తన పూర్వపు
చేతులు, కాళ్ళు,
మంచి అందమయిన శరీరాన్ని ప్రసాదిస్తాడు.
రంగభీముఁడు మాళ్వదేశపు
రాజు రాజనరేంద్రవరునకు సా
రంగధరుఁడను కూర్మిబిడ్డఁడు
ప్రథితసాధ్వి పతివ్రతామణి ర
త్నాంగి యనెడి కళత్ర మొక్కతె
హావ భావ విలాసినీమణి చి
త్రాంగి యనునొక భోగకామిని
యలరు చుండిరి వైభవోన్నతిచే
విషాద
సారంగధరను ధర్మవరం వారు నాటకంగా ప్రదర్శించారు, 17వ శతాబ్దంలోనే సారంగధర
చరిత్రమును కూచుమంచి తిమ్మకవి రచించినట్లు ఆధారిలున్నాయి అయితే ఈ చారిత్రక కథనాలతో
మన పాటలోని కథానాయికి వ్యక్తిత్వాన్ని పోల్చగల అంశాలు కనిపించడంలేదు కాబట్టి మన
సారంగధరియాకూ వీటికీ పేరులో తప్ప పోలికలు లేవని చెప్పవచ్చు.
అసలు ఈ
పాటను మొదటిగా పాడిన వారి ఉద్దశ్యం ఇంతకన్నా లోతైనది కూడా కావచ్చు, ఇంకా సరళమైనది
కూడా కాచ్చు. జానపదం లోతుల్ని అంత తేలికగా అంచనా వేయలేమనేది మాత్రం నిజం.
వెండితెరపై మెరిపించడం ఒకవైపు మేలేమో అనిపిస్తుంది కానీ విరూపమై తేలిపోవడమనే నష్టం
కూడా పొంచివుండనే వుంటోంది.
సరే
మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే ఆమె కోమలమైనదే కావచ్చు కానీ మర్లపడితే అది వీరంగధరియా
కూడా అవుతుంది. శేఖరా నీ మనిషి తనమే కొన్నింటి జాగ్రత్తగా నిలబెడుతుంది.
>>సారంగి అనే వాయిద్యాన్ని ధరించినది ఆమెను సారంగధరియా అని సంభోందించారు అని చెప్పారు అదే అర్ధాన్ని తను స్వీకరిస్తూ తను రాసిన ఒక చరణంలో ఆమెను తీగలు లేని సారంగిగా పేర్కొంటూ మర్లపడితే సివంగి అన్నారు. అయితే సారంగధరియాకు ఆ అర్ధం పొసుగుతుందా మరి?
రిప్లయితొలగించండిపొసగదండీ. సారంగం అంటే లేడి. సారంగి అనేది ఒక వాద్యవిశేషం. సారంగదరియా అన్నది సారంగధరి అన్న మాటకు జానపదరూపం అన్న మాట. కొంచెం గ్రంథభాషలో చెప్పాలంటే భ్రష్టరూపం అనీ గ్రామ్యం అనీ చెప్పాలి.
సరంగధరుడు అన్న రాకుమారుడి కథ ప్రసిధ్ధం. అది రాజరాజనరేంద్రుడితో అసంగతంగా ముడివేసేసారు కాని మరాఠాప్రాంతందేమో అనుకుంటాను. సారంగధరుడి తత్త్వం నీతిగా ఉండటం - ఆ విషయంలో నిష్ఠ వదలకపోవటం. ఈ సారంగధరి అచ్చంగా అలాంటి బుధ్ధి కలిగిన వ్యక్తి- ఐతే అమ్మాయి. అదీ ఆ పేరు వాడటంలోని విశేషం. ఇది నాకు తోచిన ముక్క.
ఒక సినిమాకవికి ఈ విషయం అవగాహన కాకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. వాళ్ళేదో అంతా తెలిసినవాళ్ళం అన్న బిల్డప్ ఇస్తే పడిపోము.
ఇకపోతె ఆ కోమలి అన్న అమ్మాయిని తెలివిగా ఇంకా మోసం చేస్తున్నారన్నదే నా అభిప్రాయం. ఆ అమ్మయిచేత ఏమి పాడించరు. ఓడదాటాక బోదిమల్లయ్య అన్నట్లు వదిలేస్తారు చూస్తూ ఉండండి.
మీ స్పందనకు ధన్యవాదాలు శ్యామలీయం సర్
తొలగించండిమా మ్యాగజైన్ ప్రచురణ చెయదానికి మీ అనుమతి 8309170419
రిప్లయితొలగించండిఆలస్యంగా మీ కామెంటు గమనించాను సారీ అండీ. 9885133969
రిప్లయితొలగించండి