| వామన గీత|| కట్టా శ్రీనివాస్
గుండెల్నిండా గాలిపీల్చే స్వేచ్ఛ లేదు
గదుల్లోంచి బయటికొచ్చే ధైర్యం లేదు
దడ దడ లాడే గుండెలకు సాంత్వన లేదు
చేద్దామన్నా పనుల్లేవు
జేబు చిల్లులకు అతుకుల్లేవు
వాక్సిన్ కి అందుబాటు లేదు
నివారణకు మందులు లేవు
ఆసుపత్రిలో పడకలు లేవు
శ్వాసలో ఆమ్లజని లేదు
కాల్చేందుకు కట్టెలూ లేవు
ఎన్నికలయితే ఉన్నాయి కదయ్యా
బతుకంతా ఎట్టాగో గడిసిపోనివ్వు
కనీసం సావులో నన్నా కూసింత గౌరవం ఇవ్వు
ఓ మారాజా!! రాజాదిరాజా
మా బోటి వామనులకు మూడడుగుల చోటివ్వు.
చీకటిదారిలో నడిచేందుకు దారినివ్వు
మాస్కు మాటునైనా ఓ నవ్వు వెలగనివ్వు.
10 మే 2021
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి