కొట్లాది ఏళ్ల క్రింత ఏర్పడిన డైక్ గీతలు ఖమ్మం పట్టణంలో ఎక్కడున్నాయో తెలుసా?

 

పోయిన్నెలాఖరులో ఖమ్మం మునిసిఫల్ ఎన్నికలలో నాకు దానవాయిగూడెంలో డ్యూటి పడింది. అక్కడ చారిత్రక విశేషాలగురించి చెక్ చేయాలని అంతకు ముందునుంచే అనుకుంటూ వుండటంతో లోకల్ వాళ్ళు ‘పాముబండ’ గా పిలిచే ఈ రాయి కాలనీ మద్యలో ఇంకా వుందా రాళ్ళుతవ్వుకెళ్లిపోయి వుంటారా అనుుంటూ బయంభయంగానే వెళ్లిచూసాను కనిపించగానే సంతోషం అనిపించింది నాకు ఈ సబ్జెక్ట్ పూర్తిగా కొత్త కావడంతో రిఫర్ చేసిన సబ్జెక్టు తో పాటు కొన్ని వివరాలను శ్రీయుత చకిలం వేణుగోపాల్ గారు, 'సౌరబ్ గార్ల నుంచి తెలుసుకున్నాను. ఈ భౌగోళిక విశేషం నిజంగా ఆశ్చర్యం అనిపించింది. కాదా మరి 360 కోట్ల క్రితం ఏర్పడిన ఒక భౌభౌతిక నిర్మాణం ఇంకా మనతో కొన్ని ముచ్చట్లు చెప్పాలనుకుంటోంది. అప్పటి భూమిలో జరిగిన మార్పులు, దాని బలాలూ బలహీనతలూ చెప్పాలనుకుంటోంది. అప్పటి కదలికలకు దాని గుండెల్లోంచి ఎగసిపడిన మాగ్మా గుర్తులనూ మనకు బొమ్మలు చేసి చూపిస్తోంది.

. మున్నేరు నదికి తూర్పువైపున, రైల్వే ట్రాక్ కు ఆనుకుని పడమరగా వున్న దానవాయిగూడెంలోని గణేశ్ నగర్ కాలనీ బొడ్రాయి దగ్గరలో విశాలమైన పరపుబండపై ఈ భూభౌతిక రేఖలు కనిపిస్తాయి. 17.14.30 ఉత్తర అక్షాంశం, 80.10.32 తూర్పు రేఖాంశం ప్రాంతంలో ఇవి కనిపిస్తాయి.


స్థూలంగా ఈ డైక్ గీతలు నాలుగు ముక్కలుగా వున్నాయి. 11 అంగుళాలనుంచి 13 అంగుళాల మందంతో తూర్పు పడమర దిశల్లోకి వ్యాపించి వున్న వీటిలోని మందమైన గీత రైల్వే ట్రాక్ కు పడమర వైపు 21 అడుగులకు పైగా వుండే ట్రాక్ కు తూర్పు వైపున 17 అడుగుల వరకూ కనిపిస్తోంది బహుశా ట్రాక్ నిర్మాణ సమయంలో మధ్యలోని భాగం తెగిపోయి వుండొచ్చు. వీటిని పైపైన మాత్రమేచూస్తూ పెయింట్ తో రాతిమీద మందంగా గీసిన పెయింట్ గీతల్లాగా మాత్రమే అనిపిస్తాయి. వాటి లోపటి భాగాన్ని చూడగలిగితేనే వాటి అసలు నిర్మాణ స్వరూపం అర్ధం అవుతుంది. అదృష్టవశాత్తూ మనకు ఖమ్మంలో డైక్ లను అలా పరిశీలించే అవకాశం కూడావుంది. ట్రాక్ కు తూర్పున వున్న డైక్ ముక్క నిలువుగా లోతులోకి పగిలిపోయి వుండటంతో రెండు రాతి గోడల మధ్య లోహం కరిగించి పోసినంత స్పష్టంగా ఈ నలుపు తెలుపు రంగుల తేడా కనిపిస్తోంది. బయటి రాతి మధ్యలోకి చొచ్చుకు వచ్చిన ద్రవం తర్వాత గట్టిపడి రాతిలా మారుతుంది కాబట్టి బయటి రాతికన్నా డైక్ రాతి వయసు తక్కువగా వుంటుంది. ఈ మందపాటి డైక్ కు దక్షిణంగా వున్న మరో గీత 2 అంగుళాల మందంతోనే వున్నప్పటికీ 44 అడుగుల పొడవుతో దీనికి సమాంతరంగా 20 అడుగుల దూరంలో తూర్పుపడమరగానే వున్నది. ఈ రెండు గీతలకు భిన్నంగా మరో గీత ఉత్తర దక్షిణ దిశలకు వ్యాపించి వుంటుంది. కొన్నిచోట్ల కేవలం అరంగుళం అంత సన్నగా వుంటూ మరికొన్ని చోట్ల రెండున్నర అంగుళాల సగటు మందంతో 15 అడుగుల దూరం పెద్ద డైక్ కు ఉత్తరంగా వ్యాపించి మధ్యలో రాయి తరలించడం వల్ల కావచ్చు 55 అడుగుల ఖాళి ఏర్పడింది ఆ తర్వాత కనిపించే బండపై మరో 35 అడుగుల పొడవులో ఇది కనిపిస్తుంది. ఈ అన్ని డైక్ ల పొడవుల మొత్తం పోయినవి పోగా మిగిలినవి 132 అడుగులపైగా పొడవుతో వున్నాయి.
ఇవి కనీసం కొన్ని కోట్ల సంవత్సరాల క్రింతం భూమిపై మనిషనే వాడు పుట్టడానికి ముందే ఏర్పడిన నిర్మాణాలు. భూమిలోపటి పొరల్లోని మాగ్మా అనే ద్రవం భూమిలోని బలహీనమైన సందుల ద్వారా బయటికి ప్రవహించి రాతి పగుళ్ల మధ్య ఇరుక్కుని కొంత కాలం తర్వాత చల్లబడి గడ్డకట్టడం వల్ల ఇలాంటి నిర్మాణాలు రూపొందుతాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నాగపూర్ కి చెందిన ప్రొఫెసర్ తుషార్ మెస్రమ్ అనే పరిశోధకులు ఖమ్మంలోని వివిధ డైక్ ల గురించి పరిశోధనా ప్రతిని గతంలో సమర్పించి వున్నారు.


డైక్ అనేది భూభౌతిక శాస్త్ర పరిభాషలోని పదం అంటే ఒక రాతి ఫలకం అనే అర్దం ఇది రెండు రకాలుగా ఏర్పడే అవకాశం వుంది. మాగ్మా ప్రవాహం వల్ల లేదా శైధిల్యం వల్ల. మగ్మా డైక్ లు రాతి పగుళ్ళ మధ్యకు మాగ్మా ద్రవం ప్రవహించి గట్టిపడటం వల్ల ఏర్పడతాయి. శైధిల్య ఫలకాలు మాత్రం ఒక రకం రాతిఫలకాల మధ్య సందుల్లోకి వేరే రకం రాతి పదార్ధం శైధిల్యం చందుతూ ఏర్పడటం వల్ల కూడా ఇటువంటి నిర్మాణాలు కనిపించే అవకాశం వుంది.
బలహీనమైన లిథోస్పియర్ పొరలు విరగటం వలన వెలువడిన మాంటిల్ ప్రాంతం నుంచి ఉత్పన్నం అయిన మాగ్నా యెక్క విస్తారమైన ద్రవం ఉబికి ప్రవహించిన గ్రానైట్ రాతి చొరబాటు ఆకృతులుగా ఖమ్మంలోని డైక్ నిర్మాణాలను గురించి చెప్పుకోవచ్చు. దీనిని సాంకేతిక పరిభాషలో సింప్లటోనిక్ డైక్ (synplutonic dyke) అని పిలుస్తారని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన శ్రీ చకిలం వేణుగోపాల్, శ్రీ సౌరభ్(బెంగళూరు) నుంచి అందిన సమాచారం ద్వారా తెలుస్తోంది. మనిషి పుట్టడానికి ముందునాటి జీవరాశుల గురించి కొన్ని శిలాజాలు చెపుతుంటే, శిలాజాలు సైతం లేని కాలం నాటి భౌగోళిక సర్దుబాట్లు రసాయన ఉత్పన్నాలు వంటి వివరాలను ఇటువంటి భౌగోళిక నిర్మాణాలు భద్రపరచి చెపుతుంటాయి. జియాలజీ నిపుణులు వీటిని పరిశీలిస్తే ఒకప్పటి ఈ ప్రాంతంలోని భూమి ఎటువంటి మార్పులకు లోనయ్యింది అనే విషయాలను చెప్పగలుగుతారు. దానవాయి గూడెం లోని డైక్ ల వయసు 360 నుంచి 380 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినవి అయివుండొచ్చని అభిప్రాయపడుతున్నారు. రేడియో మెట్రిక్ పద్దతులను ఉపయోగించి వీటి ఖచ్చితమైన వయసు తెలుసుకునే సాంకేతికత వున్నది.


ఇటువంటి డైక్ సమూహాలను అధ్యయనం చేయడం ద్వారా పెద్ద ఇగ్నియస్ ప్రావిన్సులను (LIP లు) గుర్తించడానికి సహాయపడుతుంది, ముఖ్యంగా ప్రీకాంబ్రియన్ కాలానికి. అనేక LIP లను ప్రాంతీయ-స్థాయి ఉద్ధరణ, ఖండచలనం ఖండ విభజన మరియు వాతావరణ మార్పులతో కలిపి అర్ధంచేసుకునే అవకాశం వుంటుంది.
వాయువ్య కెనడా ప్రాంతంలోని మెకంజీ డైక్ ల సమూహాన్ని ప్రపంచంలోనే పెద్ద డైక్ లుగా చెపుతారు. మూడు డజన్ల పైగా వున్న ఈ డైక్ చారల గుంపు ఐదువందల కిలోమీటర్ల కు(311 మైళ్ళకు) పైగా వెడల్పు వుండి మూడువేల కిలోమీటర్ల (1864 మైళ్ల) పొడవు దూరంతో కెనడా మొత్తంగా ఆగ్రమించి వుంటాయట. ఇవి కనీసం 1268 మిలియన్ సంవత్సరాల క్రితం రూపొందాయని నిర్దారింస్తున్నారు. జింబాబ్వేలోని ఒక డైక్ కూడా 550 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి వుంటుంది.
ఖమ్మం ప్రాంతంలో మగ్మా ద్రవపు విడుదల నేపద్యంలో ఖమ్మంజిల్లా జియోలాజికల్ పరిశోధనా ప్రతులను పరిశీలిస్తే పాల్వంచ ప్రాంతంలో లావా బూడిద ఆనవాళ్ళు సైతం దొరికినట్లు ఆధారాలున్నాయి.


To the east of the Munneru River, on the way to Danavaigudem Park, these structures look like black long stripes on a wide rocky bed next to the railway line. The locals call them as Pamubanda and help its existene with such belief. These were recently observed by Khammam-based historian Katta Srinivas when he went for municipal election duty at Danavaigudem. The scientific details are available for the sources like research papers and geologists. These are structures known as dykes according to geologists. Their geological address is N 17.14.30 and E 80.10.32. These black coloured dykes are roughly 132 feet length and 1 cm to 17 cm width.
Dikes can be either magmatic or sedimentary in origin. Magmatic dikes form when magma intrudes into a crack then crystallizes as a sheet intrusion, either cutting across layers of rock or through an unlayered mass of rock.
A dike is a body of rock, either sedimentary or igneous, that cuts across the layers of its surroundings. They form in pre-existing fractures, meaning that dikes are always younger than the body of rock that they have intruded into.
Igneous dikes form as magma is pushed up through vertical rock fractures, where it then cools and crystallizes. They form in sedimentary, metamorphic and igneous rocks and can force open the fractures as they cool. These sheets range in thickness, anywhere from a few millimeters to several meters.
If magma does not reach the surface it can cool inside the Earth’s crust creating an igneous intrusion. There are several types of igneous intrusion. Sometimes magma moves upwards as a vertical sheet, cooling to form a vertical intrusion known as a dyke. Sometimes magma moves as a horizontal sheet, cooling to form a horizontal igneous sill. In some cases a horizontal sill can become inflated forming a blister like intrusion with a convex upper surface known as a laccolith. Sometimes whole large magma chambers just sit in the crust and cool down with no magma reaching the surface. These large deep intrusions are known as batholiths (or sometimes plutons). We can find such batholiths at danavaigudem.
They are, of course, taller and longer than they are thick, often reaching thousands of meters high and many kilometers in length. Dike swarms consist of hundreds of individual dikes that are oriented in a linear, parallel or radiated fashion. The fan-shaped Mackenzie dike swarm of the Canadian Shield is over 1,300 miles long and, at its maximum, 1,100 miles wide.
Study of dyke swarms helps to recognize Large Igneous Provinces (LIPs), particularly for the Precambrian period. Many LIPs can be linked to regional-scale uplift, continental rifting and breakup, and climatic shifts


కామెంట్‌లు

  1. To send or receive assistance, you can dial the toll-free number of Quickbooks support service – Quickbooks Customer Service +1 888-698-6548 which is available 24 hours a day.

    రిప్లయితొలగించండి
  2. The only thing that can come with using this software is the income you get from work. The best part about Quickbooks Customer Service +1 877-693-1115 is that it has a team of professional employees who are available around the clock for help.

    రిప్లయితొలగించండి
  3. Your QuickBooks, then just call the customer service line. This is a toll free numbe Quickbooks Customer Service +1 855-885-5111 so you will not have any additional fees. Just be sure to provide them with all of the necessary information they need in order to help you out. View more at Quickbooks Phone Number +1 602-325-1557.

    రిప్లయితొలగించండి
  4. Thank you for this wonderful post it really helps me to understand new things keep doing this work also have a look on this Best Fertility Clinic In Faridabad

    రిప్లయితొలగించండి
  5. Thank you for this wonderful post it really helps me to understand new things keep doing this work also have a look on this Male Infertility Treatment In Faridabad

    రిప్లయితొలగించండి
  6. What a wonderful post it really it helps me a lot keep doing this work also have a look on this Infertility Treatment In Faridabad

    రిప్లయితొలగించండి
  7. What a wonderful post it really it helps me a lot keep doing this work also have a look on this IVF doctor In Faridabad

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి