అరికంట్లం || కట్టా శ్రీనివాస్

 అరికంట్లం || కట్టా శ్రీనివాస్




★ తండ్లాట


జీవసాగరతీరం

తడి ఇసుక కాన్వాసుపై

అల వెనుతిరగగానే

జీవిత  జ్ఞాన సారమంటూ

బొమ్మ గీస్తుంటాను.

చూట్టు బిగేసిన తాళ్ళు

గీసేదొక నాటక ఘట్టం.

దానిపేరు

గానుగెద్దు దారి. 


◆శూన్యానంతం...


హఠాత్తుగా ఉరికొచ్చిన కెరటం

జ్ఞాపకాలను, బొమ్మను లాక్కెళ్లిపోతుంది.

తడి ఇసుకపై ముద్రలు సైతం చూసుకోకుండానే

ఎటో వెళ్ళిపోతా0

ఇప్పుడిక కట్టేసిన వేవీ ఉండవు


ఏం జరిగిందసలు? 

ఏమీ జరగలేదు

అన్ని అయిపోయాయి.


●ఓహటి....


ఒడ్డు కొచ్చి గుడ్లు పెట్టిన తాబేలు

సంతుని కళ్లారా చూసుకోకుండానే

నీళ్లను వదలలేక వాటినే కళ్ళలో నింపుకుని

వెనక్కెళ్లి పోయింది.


■రొండు....


నీటికాకి

మేత మీది ఆశతో ఉగ్గబట్టి మునకైతే వేసింది.

నీళ్లలో ఎంతోసేపు ఉండలేక 

గాల్లోకి తిరిగొచ్చేసింది. 


నిజం అబద్దాల సరిహద్దు

నలుసంత గీత

భ్రమ వాస్తవాల

బతుకు బుడగంత







కామెంట్‌లు

  1. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. Whether you are just starting your company, working with a new vendor or just want to learn more about how QuickBooks works, dial Quickbooks Support Phone Number +1 855-769-6757 for help along the way.

    రిప్లయితొలగించండి
  3. QuickBooks is available in both software and cloud versions. They are the number one accounting software company out there, so they must be able to provide assistance when you have questions or need help with fixing something on the system. Contact them at QuickBooks Support Phone Number +1 855-769-6757 Suggest if you have any questions related to their product or need other important financing needs to be met.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి