అల్లూరి సీతారామరాజుతో జరిపిన ఏకైన ఇంటర్వ్యూ

 *అల్లూరి సీతారామరాజుతో జరిపిన ఏకైన ఇంటర్వ్యూ ఇది.*



▪️ 1923, ఏప్రిల్‌ 17న అన్నవరంలో చిలుకూరి నరసింహమూర్తి జరిపిన ముఖాముఖి ఇది. ఇది నాలుగు రోజుల తరువాత అంటే ఏప్రిల్‌ 21న పత్రికలో ప్రచురితమైంది.


నరసింహ : ఎంతకాలం మీరిక్కడ ఉంటారు?

అల్లూరి : రెండు గంటలు మాత్రమే. మేము ఉదయం 10 గంటలకు బయల్దేరతాం. కాకినాడ, నర్సీపట్నం పోలీసులకు నా సమాచారం పంపించడానికి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌కు కనీసం అర్ధగంట సమయం పడుతుంది. వాళ్లంతా ఈ గ్రామం వచ్చేసరికి పది గంటలు కావచ్చు.

నరసింహ : ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు?

అల్లూరి : నా తరువాత క్యాంపును నేనింకా నిర్ణయించుకోలేదు.

నరసింహ : ఈ ఉద్యమం వెనుక ఉన్న మీ ఆశయం ఏమిటి?

అల్లూరి : మన ప్రజలకు స్వాతంత్య్రం తీసుకురావడం.

ఈ లక్ష్యాన్ని సాధించడానికి మీరెన్నుకున్న ఆయుధం ఏమిటి?

అల్లూరి : విప్లవం ద్వారా మాత్రమే మా లక్ష్యాన్ని సాధించగలం. రెండేళ్లలో స్వాతంత్య్రం సాధించగలమన్న నమ్మకం నాకు ఉంది.

నరసింహ: ఎలా సాధ్యం.. మీరెన్నుకున్న మార్గం ద్వారా?

అల్లూరి : కచ్చితంగా. నా అనుచరులు అధిక సంఖ్యలో ఉన్నారు. మాకు ఇప్పుడు ఆయుధాలు కావాలి. అందుకే నా పర్యటన.

నరసింహ: ప్రపంచం మొత్తం హింస, విప్లవాలతో విసిగిపోయింది. ప్రతి ఒక్కరూ అహింస వైపు మొగ్గు చూపుతున్నారు. మనం గాంధీజీ సిద్ధాంతాలను నమ్ముతున్నాము.

అల్లూరి : అహింసలో మాకు నమ్మకం లేదు. హింస ద్వారానే స్వాతంత్య్రం వస్తుందని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. మేము చేపట్టిన ఐదు యుద్ధాలలో విజయాలే సాధించాం. ఈసారి మేము గాఢ విశ్రాంతిలో ఉండగా, పోలీసులు దాడి చేశారు. అప్పుడు మేము తప్పించుకోగలిగాము.

... చివరలో నరసింహమూర్తి రాస్తూ అల్లూరి సీతారామరాజు స్వచ్ఛమైన ఇంగ్లీషు, తెలుగు భాషల్లో మాట్లాడారని ముగించారు.....


Jul 03,2022 నాటి ప్రజాశక్తి కథనం 

https://prajasakti.com/Face-to-face-with-the-Revolution-Jyoti




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి