వాట్సప్ డ్యుడ్

 కట్టా శ్రీనివాస్ ||  వాట్సప్ డ్యుడ్


..||


కొందరికది విష్ బోర్డ్ 

శుభోదయాలు శుభరాత్రులు

ఎగాదిగా తగిలిస్తుంటారు.


మరికొందరికది సేల్స్ జోన్

వాణిజ్య ప్రకటన లేవో 

జిడ్డు జిడ్డుగా అంటిస్తూ 

అర్థం కాకుండానే అమ్మజూపుతారు. 


ఇంకా దారుణం

చాలా మంది(ద)కి

అది కేవలం డంపింగ్ యార్డ్

గుంపుల్లో గునగునా తిరుగుతూ

గంపలకొద్ది మోసుకొచ్చి

గబాలున గుమ్మరిస్తుంటారు. 


కొంచెంనయం

తేలికగా వెళ్ళేకొందరికది విదూషక భాండాగారం

గిలిగింతల మొలకలోచ్చాయేమో 

చూస్తూ పులకరించి పోతుంటారు.


కానీ

తియ్యటి ఊటల ఓయాసిస్సు

కాకున్నా

కనీసపు తేమనిండిన పలకరింపు

కోసం నోటిఫికేషన్ల నోరు తెరుచుకు కూర్చున్నా 

ఫన్నీ ఏమికాన్ల వెటకారం తోనో

కంగాలీ గిఫ్ ల వెక్కిరింత తోనో

క్లింగ్ మనే ఎండమావులే 

బెల్లు మోగిస్తున్నాయి

అయినా కొత్త వాసనలతో 

సాంకేతిక మొగలి పువ్వులు

ముప్పిరిగొంటుంటాయి.



Gentle Note : 😊 please take it easy 

26-02-2023 (Sunday)









కామెంట్‌లు