ప్రి వ్యూ అండ్ ప్రోలోగ్ ఆఫ్ తంగలాన్

 ప్రి వ్యూ అండ్ ప్రోలోగ్ ఆఫ్ తంగలాన్ 



అధికారం, ధనదాహం, ప్రతీకారం, స్వేచ్ఛ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(KGF) కన్నా లోతుగా కనిపించే అవకాశం వున్న హిస్టారికల్ డ్రామాగా పా రంజిత్, విలక్షణ నటుడు విక్రమ్ తో తీస్తున్న తంగలాన్ ఫస్ట్ లుక్ ఈ నెలలో రిలీజ్ చేశారు. చిత్రంగా ఇక్కడ ఆకాశమంత అంబేడ్కర్ విగ్రహా ఆవిష్కరణ జరుపుకుంటున్న సందర్భం కూడా


తంగలాన్ అనే పేరు తెలుగు రాష్ట్రాలకు కొత్త తమిళ నాడు, కేరళ, శ్రీలంక లలో కనిపించే పెరియ ( పరాయర్లు, కయ్యర్లు లేదా సంపవర్లు)  కులంలో కుల పంచాయతీ లు తీర్చే పెద్దలుగా వున్న ఒక వర్గం పెరియ నట్టన్ లేదా పెద్ద నట్టన్ అని రెండవ వారు చిన్న నట్టన్ లను తంగలాన్  అంటారు. తంగలాన్ అంటే మనమనిషి (our men) అని అర్థం. పేరుకు తగ్గట్టు గానే పెద్ద పీటలు, మాపెరగని బట్టలు వేసుకుని దూరంగా కూర్చునే పెద్దలు కాదు వీళ్ళు. వారిలో ఒకరిగా జీవనం, వారందరి లాంటి జీవితం కష్టం వచ్చినప్పుడు ముందు నిలబడే నాయకత్వం అంతే అందుకే తంగలాన్ మనవాడు. 


అయితే 1891 జనాభా గణనలో, పెరియార్ లు 348 ఉప-విభాగాలు పేర్కొన్నారు, వాటిలో కొన్ని సంఖ్యాపరంగా బలంగా వుంటే మరికొన్ని అత్యంత బలహీనంగా ఉన్నాయి. 




తమిళం లో పరై అంటే drum తెలుగులో డమరు వీరిని డ్రమ్మర్స్ గా  దక్షిణ భారతదేశంలో పనిచేసిన పందొమ్మిదవ శతాబ్దపు మిషనరీ మరియు వ్యాకరణవేత్త అయిన రాబర్ట్ కాల్డ్‌వెల్  కూడా అభిప్రాయపడ్డారు. గుస్తావ్ సోలమన్ ఒపెర్ట్ వంటి మరికొందరు రచయితలు మాత్రం పోరియన్ అనే తమిళ పదం నుండి ఈ పేరు వచ్చి వుండొచ్చు అన్నారు.  ప్రాచీన తమిళ వ్యాకరణ శాస్త్రజ్ఞులు ప్రస్తావించిన ప్రాంతీయ ఉపవిభాగం లేదా సంస్కృత పహారియా , అంటే "కొండ మనిషి అని మరో అర్థం.


అమ్మ దేవతలను పూజించే మాతృస్వామ్య వ్యవస్థ ఆనవాళ్లు గా వుండే వీరి ఆచారాలలో వారు వాడే పనిముట్ల ఆధారంగా ఉప విభాగాలు అయ్యారు. 

 సేలం మరియు ట్రిచినోపోలీలో కత్తి; సేలంలోని కైజక్కట్టి (తూర్పు); చింగిల్‌పుట్, తంజోర్ మరియు ట్రిచినోపోలీలో కొలియన్ (నేత కార్మికులు); సేలంలో కొంగ; కోయంబత్తూరులో కొరవ; దక్షిణ ఆర్కాట్‌లోని కోట్టై (కోట); సేలంలో మొరాసు (డోలు); మధురలో మొట్టై; కోయంబత్తూరులో పచ్చై (ఆకుపచ్చ); దక్షిణ ఆర్కాట్‌లోని సాంబన్; కోయంబత్తూరులో సంగిడం (సంకు, శంఖం లేదా చంక షెల్); తంజోర్ మరియు మధురలో సాజియా (సాజా లేదా ఛోలా దేశం యొక్క స్థానికులు) లాగా వున్నట్లు ఎడ్గార్ థర్ స్టన్ తన కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియాలో పేర్కొన్నారు.


2017 నాటికి, పరైయర్‌లు భారతదేశం యొక్క  అఫిర్ మాటిక్ ఏక్షన్  కింద తమిళనాడులో షెడ్యూల్డ్ కులంగా జాబితా చేయబడ్డారు.


తమిళ నాడు సేలం లోని పెరియార్ యూనివర్సిటీ ప్రశ్నపత్రంలో(2022) సామాజిక నిచ్చెనలో అత్యంత దిగువకులం ఏది అని అడిగినందుకు జరిగిన సంచలనం గుర్తుండే వుంటుంది. కానీ తరతరాలుగా గురైన అణచివేతకు ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.  



సంగం యుగంలో అద్భుతమైన స్థానాన్ని పొందినప్పటికీ. కాలప్రర్ పాలన పతనాంతరం, దున్నడం మరియు నేయడం లాంటి పనుల్లో మిగిలిపోయారు 



తమిళ సన్యాసి తిరువల్లువర్ వల్లువ మరైయర్ వర్గానికి చెందినవాడు. తమిళ సెయింట్ ఔవైయార్, ఇళంగోవడిగల్, కారైకల్ అమ్మయ్యర్, తమిళ పునరుజ్జీవకుడు అయోతిథాస్ పండితార్, తమిళ జాతీయవాది రెట్టమలై శ్రీనివాసన్ పరైయర్ వర్గానికి చెందినవారు. ఇళయ రాజా, లారెన్స్, పా రంజిత్ వంటి ప్రముఖులు ఇదే విభాగం లోకి వస్తారు. 


ఇప్పటికీ ప్రకటించిన స్టోరీ లైన్ 19వ శతాబ్దం లోని కోలార్ గోల్డ్ మైన్స్ ప్రాంతం లోని గ్రామీణ తంగలాన్ తెగ తమపై ఒత్తిడి చేసిన ఆధిపత్యానికి ఎలా ఎదురు నిలిచింది. ఎంతలా పోరాడింది అన్నది కథాంశం. 



కోలార్ గనుల కన్నా సంపన్న రాజ్యాంగ బద్ధ అధికారం లోనూ దోపిడీ ఇలాగే జరుగుతోంది. జన్యు విశ్లేషణా నివేదికల్లో సైతం మూల వాసులుగా నిర్ధారించబడినప్ప్పటికి, పకృతిక సహజ వనరులపై సహజ సమాన హక్కులు వున్నప్పటికీ బంగారు గనుల మధ్య నలిగిపోయే జీవితాలు అణగారిన వర్గాలలో అలాగే వున్నాయి. గిరిజన తెగలు వేర్వేరు రాష్ట్రాలలో వున్నా వాటిని గిరిజన మాతృభాషా, పట్యేక సంస్కృతి కలిపి వుంచుతుంది మరి వేర్వేరు రాష్ట్రాల దళితులను, దళిత బహుజనులను కలిపే దారం నేసింది ఎవరు? పాన్ ఇండియా పుణ్యమా అని బహుశా పా రంజిత్ ఆ పనికి పూనుకున్నారు అనిపిస్తుంది. ధనం వల్ల అధికారం వల్ల శక్తి లేనప్పటికీ న్యాయం గెలవడం కోసం సంఖ్యను కూడా మార్క్స్ చెప్పినట్లు పరిమానాత్మక మార్పు గుణాత్మక మార్పుకు ( quantitative change leads to qualitative change) దారితీసెందుకు ఇది ఒక అడుగు కావాలని కోరుకుంటున్నాను.


ఇదే కథనం నుంచి కేవలం ఉద్వేగం ఉద్యమమే కాకుండా అనేక సాంస్కృతిక అంశాల ప్రస్తావనకు అవకాశం వున్నట్లు తోస్తోంది. ఉదాహరణకు కన్నడ కాంథారా లాగా మలవాజియాట్టం అనేది కేరళలోని పరయ సంఘం వారు సంవత్సరానికి ఒకసారి ప్రదర్శించే ఆచారబద్ధమైన నృత్య నాటకం.  మలవాజి మాతృదేవతలు, వీరు పరాయల ఇళ్లలో ప్రతిష్టించబడి వారిచే పూజించబడతారు.

  కేరళలోని త్రిసూర్ పా ప్రాంతాల పరయ సమాజానికి చెందిన ఒక ఆచార జానపద కళలో మలవాజి అనేది పరయ్యల ఇళ్లలో ప్రతిష్టించబడి వారిచే పూజించబడే మాతృదేవత.  చెండ అనే చిన్న వేణువు, ఇళతాళం అనే లోహ వాయిద్యం, మరమ్  తోలు డప్పు వంటి వాయిద్యాల సంగీతం మరియు నాటకం ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి కాంతారా వంటి మలవాజియాట్టం మళవయ్యట్టం కరిణిలియాట్టం లేదా చెరునిలియాట్టం  చేస్తారు.కొబ్బరి ఆకులతో చేసిన కిరీటం మరియు పూల దండతో మలవాజి వేషధారణ ఉంటుంది.  మలవాజి అనే భావనలో ప్రదర్శన చేస్తున్నప్పుడు, ఒక ఆచారంగా ప్రదర్శకుడు ఒక కోడిని కొరికి, దాని రక్తంలోని కొన్ని చుక్కలు తాగుతాడు. 


మలవాజి మరియు మూకన్ చతన్ అనే రెండు ప్రధాన పాత్రలు ఉన్నాయి. మలవాజి స్త్రీ పాత్ర మరియు మణి లేదా మూకన్ చతన్ పురుషుడు. మలవాజియాట్టంలో ఆచార నృత్యం రెండింటికీ సమాన ప్రాముఖ్యత ఉంది. ఇటువంటి సంప్రదాయ కళను భాగంగా చూపించే అవకాశం వుంది. KGF అవతార్ లలో లాగా ఉద్విగ్న యుద్ద సన్నివేశాలకు అవకాశం ఉంది. పరకాయ ప్రవేశం చేయగల విక్రమ్ నటన దాన్ని బాబునైనా తనకు అనుకూలంగా మలచుకోగల పా రంజిత్ నైపుణ్యం కొంచెం ఈ సినిమా పై అంచనాలు పెంచుకోవచ్చు అనే ఆశను కల్పిస్తున్నాయి.


తంగలాన్ శీర్షిక ప్రకటన : 

https://youtu.be/Wwr-UL5e02U



https://m.facebook.com/story.php?story_fbid=pfbid02bzNTX2KCzdMa4uVzFUueXKLw5CRjba3t4jhCKsUYR6hnnvEeSTJdckUcC4ALs3gUl&id=100000435816359&mibextid=Nif5oz





















కామెంట్‌లు