ఈమధ్య వార్తల్లో న్యూజెర్సీ లోని ఒక ఇంట్లోకి దూసుకు వచ్చిన గ్రహ శకలం వార్త చదివే వుంటారు. ఈ సందర్భంగా ఇలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంట్లోకి దూసుకు వచ్చిన మరో ఉదాహరణ గుర్తొచ్చింది.
1997 డిసెంబర్ 13 వ తేదీన ప్రస్తుత NTR జిల్లా ఆంధ్రప్రదేశ్ (అప్పటి కృష్ణాజిల్లా) లోని విసన్నపేట గ్రామంలో శ్రీరాములు అనే వారి ఇంటిమీద కిలో పైన ( Eucrite, cumulate1304 గ్రాముల) బరువున్న ఉల్క ఒకటి పడింది.
రాత్రి ఇంట్లో ఆయన మంచం పై పడుకుని వుండగా ఉత్తర దిక్కునుంచి మెరుపు కాంతి తో ఉరుము లాంటి శబ్దంతో తన పూరి గుడిసె మీదకు ఏదో దూసుకు వస్తూ కనిపించిందట. కొద్దిసేపటికి ఆయన వాన పడకుండా కప్పుపై వేసిన గోనె బస్తాకు వేళ్ళాడుతూ ఒక రాయిని గమనించాడు. అదే విషయం గ్రామస్తులకు చెపితే వారు దాన్ని వింతగా గమనించి స్థానిక పోలీసు అధికారులకు రిపోర్ట్ చేశారు. వీరు ఆ సంగతి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలియజేశారు. GSI AA శిలను 16 నవంబర్ 1998 న స్వాధీనం చేసుకుంది. నాసా పరిశోధకులు కూడా ఈ ఉల్క పై లోతైన పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఈ ఉల్క శకలం కలకత్తా మ్యూజియం లో భద్రపరిచారు.
తెలుగు రాష్ట్రాలలో నమోదయిన ఉల్కా పాతాలు 1898, 1936 లలో హైదరాబాద్ లోనూ 1901 లో అల్వాల్ లోనూ ఉల్కా పాతాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి కానీ అధికారికంగా నిర్ధారణకు సాక్ష్యాలు మిగలలేదు.
1814 గుర్రంకొండ, 1870 నెడగొల్ల, 1811 పుంగనారు, 1934 తిరుపతి, 1852 ఏటూరు లలో అధికారిక నిర్ధారణలు వున్నాయి.
విసన్నపేట ఉల్కాపాతం సంగతి AI కి బ్రీఫ్ చేస్తే ఇలా ఒక బొమ్మ చేసి ఇచ్చింది.
మరికొన్ని వివరాలు
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02WteJExbqfzjA1K6pBXW54FQrXegybbo7rX5qbHByWqDsMp43rsdR9fSEGkqa5GhQl&id=100000435816359&mibextid=Nif5oz
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి