కవి తలలో ఏముందో... కవితలలోనూ అదేవుంటుందన్నట్లు. మనషులంటే వల్లమాలిన ఇష్టం, తనని ద్వేషించే వారిని, విమర్శించేవారిని సైతం స్నేహపు దారాలతో అల్లుకుంటూ పోవాలనుకునే నైజం వున్న కవియాకూబ్ గారికి, హోళీ రంగుల పండుగలోనూ మనుషులు వారి రంగాలూ, రంగులూ కనిపిస్తాయి. సప్తవర్ణాలనూ మేళవిస్తే శ్వేతపుంజమై తేలుతున్నట్లు అందరినీ శాంతిలో స్నేహంలో మిళితం చేద్దాం అంటున్నారు. కలిపితే పోయేదేముంది డ్యూడ్, ఇగోలు తప్ప. తేటగా చిక్కగా కొత్తదనంలోకి ఇంకుతారు. వివిధ కారణాలతో అంటిన మరకలనీ మురికినీ రంగేమో అని భ్రమపడే ఇబ్బందినుంచి మరికొంచెం మేళవించిన రంగుల్లో తేలుద్దాం అంటారు, ఇంకాస్త ఇంకాస్త కలిసిపోయి మనుషులుగా మిగలాలనుకునే ఈ కవి ఉద్వేగాన్ని ఆంగ్లీకరించే ప్రయత్నం చేసాను. అన్నయ్య కళ్ళలో కొంచెం ప్రేమ మెరుపు చూడాలని.
కవియాకుబ్ || రంగులు ||
~
కొంచెం కలుపుదాం
రంగులు కలిపినట్టు మనుషుల్ని
కలిపితే పోయేదేముంది
వాళ్ళ వాళ్ళ రంగుల్ని
కొంచెమైనా మార్చుకుని కలిసిపోతారు
పోయేదేముంది
తేటగానైనా, చిక్కగానైనా
ఏదో ఒక రంగు కొత్తదనంలోకి ప్రవేశిస్తారు
ఇంకిన కొత్త రంగుల ఆత్మగానైనా
ఆ కొంచెంసేపు కనిపిస్తారు
పుట్టుకతో తెచ్చుకున్న
అర్హతల వలువలు వదిలి
కేవలం మనుషులుగానైనా మిగులుతారు
ఆ కొద్దిసేపు
పోయేదేముంది
ఇంకాస్త రంగుల్ని కలుపుదాం
అసలుసిసలు మనుషులుగా
మారే వీలుందేమో ఒకసారి ప్రయత్నిద్దాం
Translation : Katta Srinivas
Colours
Blend the hues, let's intertwine,
Humans akin to colors, so divine.
Merge them without fear or fuss,
Their shades shift, a colorful discuss.
In this journey, we may fluctuate,
Light or bold, we navigate.
Embrace novelty, in souls anew,
Briefly adorned in a colourful hue.
Inherent traits, let's set aside,
Just human beings on this ride.
For a fleeting moment, we'll be,
In varied shades, we'll briefly see.
As we journey on, let's enhance,
With more colors, let's advance.
As genuine people, let's aspire,
To alter hues and reach higher
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి