Let the heart's tender musings flow unabated.










విత్వంతో హృదయాంతరాళాలను, చరిత్రతో మానవపరిణామక్రమానుగత పరిణామాలను అన్వేషిస్తూ, వాటిని అందరికోసం అభివ్యక్తీకరించే బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీరామోజు హరగోపాల్ గారి జన్మదిన శుభాకాంక్షలతో వారు మూడురోజుల క్రిందట పోస్టు చేసిన కవితకు ఇది ఆంగ్లానువాదం. యథాతథ భాషానువాదం లాగా కాకుండా మొక్కను తిరిగి నాటే క్రమంలో కొంచెం స్వేచ్చతీసుకున్నాను.


మూలం : Sriramoju Haragopal

|| రానీ, రానీ ఇన్ని గుండె తలపుల్ని... ||

కవిత్వం హృదయ
కిరణజన్య సంయోగక్రియ
ఆ పచ్చదనమంతా
వరిమడిల కలుపుతీసిన రామక్క చేతిచలువ
ఆ పంటంతా
వందలేండ్ల నుంచి సాగుచేస్తున్న రైతు దయ
కవిత్వం ఒడ్డున కూచుని
నది అలల మీద మెరుపులకు మురవడం కాదు
మట్టిలో పుట్టెడు గింజలై మొలకెత్తే నారుమడి అవడం
నాగలివెంట వేలుపట్టుకుని నడిచిన మానవ సంస్కృతి
గొడ్డలై అడవులు నరికిన గూడు తాపత్రయం
బతుకంటేనే పోరాటమైన మానవ నవదళ వికాసం
దోసిళ్ళకొద్ది దయతోని ఆకలి, దప్పులు తీర్చిన ప్రాణదాత
మనిషి ముఖం నిండా నవ్వై విరబూసిన శ్రమైకగీతం
ఎత్తుకెత్తు పెంచి, గుండెలకత్తుకున్న సహజీవన సమధర్మం
కవిత్వమంటే రాసేటపుడు ఆయుధమై మెరవచ్చు, ఆనందమై పూయొచ్చు
కవిత్వం మనిషి భుజం మీద వెలిగే రేపటిరూపు
ఉత్తగనె ఉలికిపడి రాలిపడే కన్నీటిచుక్కలు కాదు
మనిషి శ్వాసంత నిజం, మాటంత నిజం, బతుకంత నిజం కవిత్వం
మనిషి బాధతో, సంతోషంతో కేరింతలాడిన భాష కవిత్వం.

ఆంగ్లానుసరణ : Katta Srinivas
||Let the heart's tender musings flow unabated.,||

Let the heart's tender musings flow unabated.
Where poetry breathes, photosynthesis more.
Greenery thrives, Ramakka's hands weave,
Kindness of farmers, generations conceive.

Not just smiling at rivers' gleaming prance,
But poetry's banks, in trance, we dance.
Paddies bloom in spring's warm embrace,
Civilization's plow marks its grace.

Axes rest where forests once stood tall,
A navy born, humanity's rise, its call.
Nourishing souls quench hunger's thirst,
Life's essence is bestowed, in kindness immersed.

Smiles gather from the toiling throng,
Hope and hardship, in their dance, belong.
Poetry wields power, a pen as its might,
Dancing bliss descends, pure and bright.

Tomorrow's light on humanity's plight,
Guiding amidst the darkest night.
Not just a tear, in sight it falls,
Human breath, genuine, vibrant calls.

The language of suffering, and happiness, it sings,
In every heartbeat, in life's springs.



కామెంట్‌లు