||చిక్కుతీసిన ప్రశ్న|| కట్టా శ్రీనివాస్
వాదన మధ్య
గెలుపు మెరుపుతో నా కళ్ళ లోకి
చూస్తూ అడిగాడు అతను.
మంటల్లో తగల బడబోతున్న ఒక ఇంటి నుంచి ఒక మనిషిని కానీ
ఒక మొక్కను కానీ కాపాడాలి అంటే నువ్వు దేన్నీ ఎంచుకుంటావు?
రెండింటినీ కాపాడాలి కదా?
ఇద్దరినీ అనలేదు నేను ఎందుకో!!
ఒక్కదాన్నే అని చెప్పానుగా.. అర్థం కావడం లేదా అనే అసహనాన్ని కష్ట పడి దాయాలని ప్రయత్నిస్తున్నాడు మిత్రుడు.
అందరూ ఒకేలా ఎంచుకోవాలని ఏముంది? నేను ఇంకా చెప్పకుండానే..
ముందు చెప్పు నువ్వు ఏం ఏంచుకుంటావు?
ఇంత చిన్న లాజిక్ కి నేను కావాలని దాట వెస్తున్ననేమో అన్న అనుమానం అతని కళ్ళలో గుర్రుగా ఉరుముతోంది.
సమాధానం లేని చోట ఇరుక్కున్నప్పుడల్లా "నీది తోండాట" అని ఆక్షేపించే ప్రయత్నం చేస్తాడు. కాకపోతే కొత్త పదాలు వెతుక్కుంటాడు. చదువరి కాబట్టి.
పాత సినిమాల్లో బాణాల యుద్ధం లాగా ఇప్పుడు అతని ప్రశ్న నన్ను మళ్ళీ మళ్ళీ తెగ గుచ్చు కాకుండా
సందించాను మెల్లగా.
సరే మిత్రమా అదే ప్రశ్న నేను ఇంకోలా అడుగుతాను అందులో సమాధానం వుండొచ్చు చూడు.
భూమి అనే ఇల్లు గ్లోబల్ వార్మింగ్ లో తగలబడి పోయే లోగా మానవ సంతతి, వృక్ష సంతతి ఒక్క దాన్నే కాపాడాలంటే నువ్వు దేన్నీ ఎంచు కుంటావు?
పరస్పర పూరకాల్లో ఒక్క దాన్నే కాపాడటం అంటే దాని అంతాన్ని ఆలస్యం చేయడమే కానీ ఆపడం కాదు.
హీనపక్షం
తక్కువ ఆధారపడి స్వంతంగా బతక గలిగే దాన్ని మిగిల్చాలి కదా!
చాలా ఎత్తుకి ఎగిరిన బాణం అసలు ఆయన కంటికి ఆనుతుందో లేదో!
ఇప్పుడది తిక్క ప్రశ్న కాదు
లెక్కప్రశ్న.
రెండు అవసరమే కదా.. అప్పుడు రెండిటిని కాపాడాలి కదా..? ఒకటి కాపాడితే మరి రెండోధాని మనుగడ అంతరించే పమాదం ఉంది కదా..? మనిషి ఈ ప్రకృతి కి ఎంత అవసరమో ఆలాగే ఈ ప్రకృతి కూడా మనిషి కి అంతే అవసరం.
రిప్లయితొలగించండి