1
మొన్న ఒక పువ్వు కోసాను.
నిన్న ఇంకోటి అంతకంటే అందమైంది చూసాను.
ఈ రోజు ఒక పువ్వుతో మాట్లాడితే అదంది-
"నాతో వాటి గురించి చెప్పనే చెప్పకు.
చిన్న గాలికే నేను వణికిపోతాను."
2
ఒకప్పుడు ఒళ్ళు తెలీకుండా ప్రేమించాను.
తర్వాత ఒళ్ళు తెలిసేలా ఇష్టంగా దగ్గరికి తీసుకున్నాను.
ఇవ్వాళ్టి మనిషి నన్ను దూరంగా తోసి అంటోంది-
"నాకు వాళ్ళ గురించి చెప్పనే చెప్పకు.
ఒక్క ముద్దు ఎక్కువున్నా నేను వెళ్ళిపోతాను"
3
ముందైతే గుండె ముక్కలయ్యేది.
తర్వాత్తర్వాత ఆకురాయి తెచ్చి ఎవరో పొడిగా రాల్చేది.
ఇప్పుడా?
ఈ గాల్లో దుమ్ములో చేరి నీ కళ్ళలో పడిందే
ఈ పద్యంలో ఉన్నదే నా హృదయం.
02.04.24
I plucked a flower one gentle day,
Yet another bloomed with brighter grace.
I spoke to blossoms soft and shy,
They whispered, "Speak not of such days,
I tremble at the slightest breeze."
2
Once, my love knew no bounds,
I brought it close with mindful care.
Today's maiden pushed me away,
"Speak not of them," she firmly said,
"One kiss ends, and I'll be wary."
3
In the past few days, my heart would break,
A friend would bring a stone to dry it.
Now the wind stirs dust to fall in your eyes,
My heart resides within this poem.
కన్నెత్తి చూసావనీ
గొంతెత్తి పాడావనీ
ప్రేమించాను
నువ్వు పిట్టవో
నేను పూవునో తెలీదు
దేవతై మెరిసినందుకూ
దేహమై కురిసినందుకూ
ప్రేమించాను.
నువ్వు మబ్బువో
నేను చినుకునో
తెలీదు
చేతులుచాచి హత్తుకున్నావనీ
కాళ్ళు చాచి ఎత్తుకున్నావననీ
ప్రేమించాను
నువ్వు కనుమవో
నేను జలపాతాన్నో తెలీదు
రక్తం ఉప్పొంగి కూడినందుకూ
పక్కటెముకల్లో దాచినందుకూ
ప్రేమించాను
నువ్వు కడలివో
నేను యేరునో
తెలీదు
నువ్వు మృత్యువో
నేను ప్రాణమో తెలీదు
19-07-24
For your fiery gaze
And your voice is so sweet,
I loved you.
Yet I wonder,
Are you a bird, and I, a flower beneath?
Because you shone like an angel,
With your form so divine,
I loved you.
Yet I ponder,
Are you a cloud, and I, a raindrop in line?
Because you embraced me with outstretched arms,
Or lifted me high with ease,
I loved you.
Yet I question,
Are you a mountain, and I, a waterfall's breeze?
I wonder still:
Are you an ocean, and I, a river's quest?
Or perhaps,
Are you the goddess of death, and I, a life so blessed?
నువ్వు తాగిన సారాయి కోసం
ద్రాక్షల్లో వెతికి దొంగనయ్యాను
నువ్వు తిన్న నిషిద్ద ఫలం
పొత్తిళ్లలో వెతికి పాపినయ్యాను
నువ్వు పీల్చే నెత్తావి గాలి
ఊపిరిలో వెతికి లోభినయ్యాను
నువ్ ప్రార్ధించే స్నానపు గదిలో
నగ్నమైనందుకే దేవున్నయ్యాను
21-07-24
For the taste of the wine you savoured,
I sought in the vineyards and turned to a thief.
The forbidden fruit you devoured,
I searched within and became a sinner.
For the primal source of air,
I sought in your breath and became entranced.
In the bathroom where you worship,
I became divine, for I was bare.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి